ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని... అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. పనుల పురోగతి తెలుసుకుంటారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు ప్రెసిడెన్షియల్ కాటేజ్ సహా ఇతర వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.
నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ - kcr review
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే చాలాసార్లు యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి.. మరోసారి ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.
రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
త్వరలోనే మహాసుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. వంద ఎకరాల యజ్ఞవాటికలో... 1048 యజ్ఞకుండాలతో ఈ యాగాన్ని నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం యాదాద్రి గుట్ట సమీపంలో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ స్థలాన్ని కూడా పరిశీలించి... అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు సహా యాగానికి సంబంధించిన ఏర్పాట్ల విషయమై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
- ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు
Last Updated : Dec 17, 2019, 8:01 AM IST