తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల దుస్థితికి కేసీఆర్ అలసత్వమే కారణం: కిషన్ రెడ్డి - MPTC ZPTC ELECTIONS

వడగళ్లవానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా నేత కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన అన్నదాతలకు న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీవ్ర నష్టం చేసింది : కిషన్ రెడ్డి

By

Published : Apr 21, 2019, 6:55 PM IST

Updated : Apr 21, 2019, 7:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురం, మల్కాపురంలో వడగళ్లవానతో నష్టపోయిన పంటలను భాజపా నేత కిషన్‌రెడ్డి పరిశీలించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే ప్రస్తుత రైతుల దుస్థితికి కారణమని ఆరోపించారు.

పంటల బీమా పథకం విషయంలో రైతన్నలు తమ వాటా కట్టినా...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా చెల్లించకుండా అన్నదాతలకు తీవ్ర నష్టం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీద ఉన్న ధ్యాస అన్నం పెట్టే రైతన్నల మీద లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అన్నదాతలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

వెంటనే అన్నదాతలకు తగిన పరిహారం అందించాలి : కిషన్ రెడ్డి

ఇవీ చూడండి : ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు..!

Last Updated : Apr 21, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details