గతంలో తల్లి, నేడు తండ్రి మరణించడం వల్ల పిల్లలు ఒంటరి వారైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బైరపాక నవీన్... ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య రేణుక ఇదివరకే మృతి చెందారు. వీరి పిల్లలు తొమ్మిదేళ్ల అస్మిక, ఏడేళ్ల హర్ష అనాథలయ్యారు. అమ్మానాన్నలను కోల్పోయి రోదిస్తున్న చిన్నారులను చూసి బంధువులు, స్థానికులు చలించిపోయారు.
నాడు తల్లి, నేడు తండ్రి మృతి... ఆదుకుంటామన్న కేటీఆర్ - మాటురులో అనాథలైన పిల్లలు
యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరులో తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఇటీవల తండ్రి మరణించగా.. ఇదివరకే తల్లి మృతిచెందింది.
నాడు తల్లి, నేడు తండ్రి మృతి
పిల్లలకు తోడుగా 70 ఏళ్ల నానమ్మ మాత్రమే ఉంది. వారిని చేర దీసే వారు కరువయ్యారు. పిల్లలు కన్న తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు. విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ వారిద్దరనిఈ చిన్నారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికి సహకరించేందుకు చిన్నారుల వివరాలు పంపాలని ట్వీట్ చేశారు.
Last Updated : Sep 12, 2020, 12:22 PM IST