కొవిడ్ మహమ్మారి దేశానికి పెద్ద సవాలుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన పర్యటించారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మౌలిక పసతులపై ఆరా తీశారు. కొవిడ్ ఇన్ పేషంట్ వార్డును ఆయన పరిశీలించారు.
ప్రపంచంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉందని ఆయన తెలిపారు. డీఆర్డీఏ తయారుచేస్తున్న కొత్త మందు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లోనే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైరస్ కట్టడికి అందరూ సహకరించాలని కోరారు.