యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆయనకు ఆసుపత్రి సిబ్బంది, భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణ పనులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఎయిమ్స్‌ను త్వరగా పూర్తి చేస్తాం: కిషన్ రెడ్డి - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. ఎయిమ్స్ వైద్యులు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.
బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన కిషన్‌రెడ్డి
ఎయిమ్స్‌ను త్వరగా పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక దేశావ్యాప్తంగా తొమ్మిది 9 ఎయిమ్స్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతి, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ బాటియా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి:వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!
Last Updated : Oct 10, 2020, 12:35 PM IST