యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఓ సెల్‌టవర్‌ను తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రేడియేషన్ వల్ల అనేక మానసిక, శారీరక సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నామన్నారు. జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టవర్ లీజు సమయం ముగిసినా టవర్‌ను వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా వారిని స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. తమ లీజు గడువు ముగిసే వరకు ఈ టవర్ వినియోగంలోనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పి ఆందోళనను విరమింప చేశారు.
'సెల్ టవర్‌ను తొలగించాలని స్థానికుల ఆందోళన' - రేడియేషన్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న సెల్‌టవర్ తొలగించాలని స్థానికుల ఆందోళన చేపట్టారు.
'సెల్ టవర్‌ను తొలగించాలని స్థానికుల ఆందోళన'