తలసేమియా రోగులను రక్షించేందుకు.. రక్తదానం చేయడం అభినందనీయమన్నారు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో.. పోలీసు శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను ప్రత్యేకంగా అభినందించారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
యాదగిరిగుట్టలో రక్తదాన శిబిరం - రాచకొండ కమిషనర్
యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో.. పోలీసు శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువకుల నుంచి మంచి స్పందన లభించింది. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు.. కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
కరోనా కాలంలో.. తలసేమియా బాధితులు రక్తం కొరతతో ఇబ్బందులు పడుతున్నారని డీసీపీ వివరించారు. కొవిడ్ బాధితుల్లో కూడా అనేక మంది రక్తం కోసం వేచి చూస్తున్నారని అన్నారు. రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున యువత తరలి రావడం.. ఎంతో స్ఫూర్తిదాయకమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ లక్ష్మీ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, సీఐ జానకి రెడ్డి, ఆర్ఐ అడ్మిన్ నాగరాజు ఎస్ఐలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: జీవన్ రెడ్డి