వరంగల్‌లో ఆదివారం జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భూదాన్‌పోచంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు రాజాసింగ్‌ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రాజాసింగ్‌ను పోలీసుల విడుదల చేశారు.
వరంగల్ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. విడుదల - బీబీనగర్ వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
వరంగల్‌కు వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. భూదాన్‌పోచంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం విడుదల చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వరంగల్ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. విడుదల
అయోధ్యలో రామమందిర నిర్మాణం రామ భక్తులందరి కార్యక్రమం అని రాజాసింగ్ అన్నారు. అందుకోసం సేకరిస్తున్న విరాళాలపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కారమైందని... ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆలయ నిర్మాణ వ్యవహారాలు ట్రస్ట్ ద్వారా జరుగుతాయని... దీనిని రాజకీయం చేయడం తగదన్నారు.
ఇదీ చూడండి:పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్