యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పర్యటించారు. లాక్డౌన్(Lock Down) అమలు తీరును పరిశీలించారు. పాతగుట్టకు వెళ్లే మార్గం వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
Lock Down: యాదగిరిగుట్టలో పర్యటించిన డీసీపీ నారాయణ రెడ్డి - భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి వార్తలు
భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించారు. లాక్డౌన్(Lock Down) అమలు తీరును పరిశీలించారు.
Lock Down: యాదగిరిగుట్టలో పర్యటించిన డీసీపీ నారాయణ రెడ్డి
అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారుల వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:VIRAL: వ్యక్తిని కర్రలతో కొట్టి, కత్తితో పొడిచి..
TAGGED:
Telangana news