రైతులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రేపటి రైతుల భారత్బంద్పై స్పందించారు. రాష్ట్రంలో వర్షాలకు నష్టపోయిన పంటని కొనని కేసీఆర్.. ఏ విధంగా బంద్‌కు మద్దతు ఇస్తారని మండిపడ్డారు.
కేసీఆర్‌కు భారత్‌బంద్‌కు మద్దతిచ్చే హక్కు లేదు: కోమటిరెడ్డి - Yadadri District Latest News
రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... రైతుల భారత్ బంద్‌కు మద్దతిచ్చే నైతిక హక్కు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సన్నరకం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల ఆందోళనలకు ఎలా మద్దతు తెలుపుతారని ఎద్దేవా చేశారు. రేపు జరిగే భారత్ బంద్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేసీఆర్‌కు భారత్‌బంద్‌కు మద్దతిచ్చే హక్కు లేదు: కోమటిరెడ్డి
కేంద్రంలో మోదీ సర్కారు... రైతు వ్యతిరేక బిల్లును ఏక పక్షంగా ఆమోదించారని విమర్శించారు. సోనియా గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రైతులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మోదీ సర్కారు రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.