రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తులకు నూతన రుచులతో తయారు చేసిన ప్రసాదాలను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం నుంచి బెల్లంతో తయారుచేసిన లడ్డూ ప్రసాదంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. వీటి ధరను రూ.25గా నిర్ణయించినట్లు వెల్లడించారు. బెల్లం లడ్డూతో పాటు చక్కెరతో తయారు చేసిన లడ్డూ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. బెల్లం పానకంతో తయారు చేసిన లడ్డూల నాణ్యతను దేవాదాయ శాఖ పరిశీలించిన పిమ్మట వాటి విక్రయానికి అనుమతిచ్చింది. కొత్త ప్రసాదాలను కౌంటర్ నుంచి భక్తులు పొందవచ్చని ఈవో తెలిపారు.
యాద్రాద్రిలో భక్తులకు బెల్లం లడ్డూ ప్రసాదాలు - prasadam
యాదాద్రి దేవస్థానంలో సరికొత్త అంకం ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారిగా ఆలయ అధికారులు బెల్లంతో చేసిన లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతి రావటం వల్ల నేటి నుంచి బెల్లం లడ్డూలను భక్తులకు విక్రయించడం ప్రారంభించారు.
యాద్రాద్రి భక్తులకు బెల్లం ప్రసాదాలు