యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో.. ముంపునకు గురవుతున్న బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్థులు ఆందోళన చేశారు. రిజర్వాయర్ వద్ద జరిగిన ఈ నిరసనలో భూములు, ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'న్యాయం చేయకపోతే నిర్మాణ పనులను అడ్డుకుంటాం' - baswapuram reservoir victims protest
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
స్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు ఆందోళన
ఇటీవల తనకు న్యాయం చేయాల్సిందిగా నిర్వాసితుడు సతీశ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా.. ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు
ఇదీ చదవండి:పార్లమెంట్ అత్యవసర భేటీకి విపక్షాల డిమాండ్