యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్న యాదగిరి గుట్ట మండలం లప్ప నాయక్ తండా రైతులు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని సమాచారం అందుకున్న గిరిజనులు నష్ట పరిహారం చెల్లించాలంటూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల నిరసన - Yadadri Bhuvanagiri News
బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న ముంపు బాధితులు యాదగిరి గుట్ట మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్నామని.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అప్పట్లో నాగార్జున సాగర్ నిర్మాణంలో ఓ తండా ముంపునకు గురి కావడం వల్ల లప్ప నాయక్ తండాకు వచ్చి నివాసం ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు బస్వాపూర్ రిజర్వాయర్ కింద మళ్లీ ముంపునకు గురి కావాల్సి వస్తున్నదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోయే రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని వారి భూములు, ముంపుకు ఎంత ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసి జీవనం సాగించే తమకు.. తిరిగి వ్యవసాయ భూములు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?