యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 8 న ప్రారంభం కానున్నాయి. ఏటా జరిగే ఈ వేడుకలను ఈ సారి 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కానందున పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే నిర్వహించాలని దేవస్థాన నిర్వాహకులు, పూజారులు నిర్ణయించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని 15నమధ్యాహ్నం బాలాలయంలో, కొండ కింది పట్టణంలో రాత్రి నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా 11రోజులపాటు మొక్కు నిత్య కల్యాణాలను నిలిపివేస్తారు. శివరాత్రికి ఆరురోజులు కొనసాగే వేడుకలను మార్చి 1న శ్రీకారం చుడతారు.
బ్రహ్మోత్సవాలు@యాదాద్రి - READY
యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ప్రధానాలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నందున బాలాలయంలో ఉత్సవ క్రతువులు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
యాదాద్రిలో వేడుకలు