Automatic Sprayer for Poultry Farms రసాయనాల పిచికారికి లేదిక శ్రమ.. యాదాద్రి యువకుడి వినూత్న ఆలోచన Automatic Sprayer for Poultry Farms Designed by Farmer :సాధారణంగా వ్యవసాయం, కోళ్లఫారాల(Poultry Farms) సాగులో మందులు పిచికారి చేయడం తప్పనిసరి. అయితే ఈ మందుల పిచికారీకి ఎంతో శ్రమ అవసరం. పైగా ఆ మందుల వాసన తగిలిన, శరీరం మీద పడినా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అదే విధంగా మందులు సరైన మోతాదులో పడకపోతే ఉత్పత్తి తక్కువగా వచ్చి నష్టపోయే అవకాశాలు ఏర్పడవచ్చు. ఇవన్నీ అధిగమించడానికే ఓ నూతన ఆలోచనను ఆచరణలోకి తెచ్చాడు ఈ యువకుడు.
యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లసింగారంకు చెందిన ప్రవీణ్. చదివింది పదో తరగతి. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు వీలుకాలేదు. అంత తక్కువ చదువుతో ఏ ఉద్యోగం రాదని తలచిన ప్రవీణ్.. స్వయంకృషితోనే పైకి ఎదగాలని సంకల్పించాడు. వ్యవసాయంపై దృష్టి సారించాడు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని పదివేల సామర్థ్యంగల కోళ్లతో ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
Kadaknath Poultry farming: కడక్‌నాథ్ కోళ్ల పెంపకం.. రెట్టింపు ఆదాయం..
Intinta Innovator Award :షెడ్‌లో కోళ్లను పెంచే స్థలంలో మందు పిచికారీ చేసే ప్రతిసారి ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉండడంతో.. మనిషి సాయం లేకుండా యంత్రంతో మందులు స్ప్రే చేశాలనే ఆలోచన చేశాడు. అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టాడు. 30వేల రూపాయల ఖర్చుతో రైతులకు, కోళ్లఫారాలు నిర్వహించేవారికి ఉపయోగపడే విధంగా ఆటోమేటిక్ స్ప్రేయర్నురూపొందించాడు. అంతేకాక పెట్రోల్ ఖర్చు అవసరంలేకుండా..12 వాట్ల సామర్ధ్యం గల సోలార్ పలకను ఈ యంత్రానికి ఏర్పాటు చేశాడు.
ఎప్పటికప్పుడు మందులు పిచికారి చేసుకోడానికి సులువుగా తాను తయారుచేసిన పరికరానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అమర్చాడు. దీనికి ఒక ట్యాంక్ అమర్చి అందులో మందు వేసి ఆపరేట్ చేయవచ్చు. అది షెడ్డు మొత్తం క్రిమిసంహారక మందు స్ప్రే చేస్తుంది. దీని ద్వారా కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా పని మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుందంటున్నారు ప్రవీణ్. రసాయన మందుల వల్ల శరీరానికి ఎలాంటి హానీ తలెత్తదని కూడా చెబుతున్నాడు.
రూ.5వేలతో బిజినెస్ షురూ.. ఇప్పుడు టర్నోవర్ రూ.12వేల కోట్లు.. 'సుగుణ చికెన్' కథ ఇదీ..
Yadadri Bhuvanagiri Latest News :తాను ఆవిష్కరించిన స్ప్రేయర్‌ను(Automatic Sprayer) వ్యవసాయ రంగంలోనూ ఉపయోగించుకోవచ్చని అంటున్నాడు. పొలాల్లో మందులను సులభంగా పిచికారీ చేయడానికి కూడా ఇది పనికి వస్తుందని చెబుతున్నాడు. స్ప్రేయర్‌కు నాలుగు చక్రాలు అమరిస్తే పొలాల్లోకి సులువుగా దూసుకుపోతుందని వివరిస్తున్నాడు. ప్రవీణ్ చెప్పిన దాని ప్రకారం.. కూరగాయలు, పందిరి తోటలు, వరి చేలలో కూడా ఇది మందులు పిచికారి చేయగలదు. దీని వల్ల మొక్కపై మాత్రమే ద్రావణం పడి పర్యావరణానికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది.
కోళ్ల పెంపకం, వ్యవసాయం కోసం రూపొందించిన స్ప్రేయర్‌కు మరో 20వేల రూపాయలు ఖర్చు చేస్తే అదనపు సౌకర్యాలను జోడించవచ్చని ప్రవీణ్ చెబుతున్నాడు. జీపీఎస్, వైఫై, సీసీ కెమెరా అమర్చవచ్చని కూడా వివరిస్తున్నాడు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తే రైతు ఎక్కడున్నా వెంటనే ఆయన సెల్‌ఫోన్‌కి అలారం వచ్చేలా సాంకేతికతను ఇందులో అమర్చుకోవచ్చు. ఈ స్ప్రేయర్ వాహనానికి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అమర్చినట్లయితే పొలంలో గడ్డిని కూడా కత్తిరిస్తుందని ఆవిష్కర్త తెలిపాడు.
Agri Inventions in Telangana :రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన ఇంటింటా ఇన్నోవేటర్(Intinta Innovator Award) సెల్ పోటీకి తాను రూపొందించిన పరికరం నమూనాను పంపించాడు ప్రవీణ్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ ప్రాజెక్టు ఒక్కటే, ప్రదర్శనకు ఎంపికైందని.. ప్రవీణ్ చాలా ప్రతిభావంతుడని సన్నిహితులు చెబుతున్నారు. జీవితంలో తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని ఈ ఆవిష్కరణ రూపొదించాడు ప్రవీణ్.
ప్రజలు, రైతులకు ఉపయోగపడే పరికరాలు తయారు చేసే ఆలోచనలు తన వద్ద ఇంకా ఎన్నో ఉన్నాయని అంటున్నాడు. పెట్టుబడి లేక పోవడంతో తన వినూత్న ఆలోచనలు కార్యరూపంలోకి తేలేకపోతున్నానని చెబుతున్నాడు. ప్రభుత్వం తనకు సహకరిస్తే మరిన్ని ప్రయోజనకరమైన ఆవిష్కరణలను రూపొందిస్తానని ధీమాగా చెబుతున్నాడు.
"నాకు కోళ్లఫారంలో స్ప్రే చేసేటప్పుడు రసాయనాలు శరీరంపై పడినప్పుడు అలర్జీ వచ్చింది. స్ప్రే చేయడానికి కూలీలు దొరకడం లేదు. ఏదైనా వినూత్నంగా చేద్దామని ఆలోచించి.. రిమోట్ కంట్రోల్ స్ప్రేయర్ రూపొందించాను. దీనిని పౌల్ట్రీలోనే గాకుండా పంటలకు స్ప్రే చేయవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డుకు ఎంపికైంది". - ప్రవీణ్, స్ప్రేయర్ సృష్టికర్త
హైటెక్ కోళ్ల ఫారం.. రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
బహుముఖ సేద్యంతోనే రైతుకు నిజమైన పండగ