యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు ఉన్న ఇళ్లను దాదాపు కూల్చివేశారు. భారీ యంత్రాలతో గత వారం రోజులుగా ఈ పనులు చేపట్టారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు, నిర్వాసితులకు పరిహారం చెల్లించి పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చేలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు పనులను వేగవంతం చేశారు.
ఇప్పటికే 80 శాతం పనులు పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నాయి. భారీ యంత్రాల సాయంతో కూల్చి వేసిన శిధిలాలను తొలగించి. మరో వైపు నుంచి ఎర్రమట్టితో నేలను చదును చేస్తున్నారు. కొండ కింద నూతనంగా నిర్మించిన వైకుంఠ ద్వారం వద్ద ఉన్న.. అతి పురాతనమైన రావిచెట్టును రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు.