తెలంగాణ

telangana

నెమురగొముల సర్పంచ్​గా ఆముదాల  అపర్ణ ప్రమాణస్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగొముల కొత్త సర్పంచ్​గా ఆముదాల అపర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. నిధుల దుర్వినియోగం అభియోగాలతో... పాత సర్పంచ్​, ఉప సర్పంచ్​లను తాత్కాలికంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులను జారీ చేశారు.

By

Published : Jun 18, 2020, 1:09 PM IST

Published : Jun 18, 2020, 1:09 PM IST

Sarpanch Aparna
నెమురగొముల సర్పంచ్​గా అపర్ణ

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగొముల సర్పంచ్​గా ఆముదాల అపర్ణ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. నిధుల దుర్వినియోగం అభియోగాలతో... పాత సర్పంచ్ ఆముదాల సుమతి​, ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి జకీర్​​లను తొలగిస్తూ కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సర్పంచ్​గా అపర్ణను కలెక్టర్​ నామినేట్​ చేయగా ఎంపీడీవో వాజీద్​ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. సంయుక్త చెక్‌పవర్‌ కోసం గ్రామానికి చెందిన రెండు వర్గాలు తీవ్రంగా పోటీపడ్డాయి. 9 మంది వార్డు సభ్యుల్లో ఐదుగురు శ్రీకాంత్‌కు మద్దతు తెలిపారు. మెజార్టీ సాధించిన శ్రీకాంత్​కు సంయుక్త చెక్‌పవర్‌ కల్పిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇవీ చూడండి:కల్నల్​​ సంతోష్​ బృందాన్ని ఉచ్చులో బిగించారా?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details