తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలేరు మాజీ ఎమ్మెల్యే పోచయ్యకు కోమటిరెడ్డి నివాళి - యాదాద్రి జిల్లా వార్తలు

గుండెపోటుతో హైదరాబాద్​లోని దక్కన్​ ఆస్పత్రిలో చేరిన పోచయ్య గురువారం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆయన గతంలో ఆలేరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు.

Aler Ex MLA Challuru Pochaiah Die With Heart Attck
ఆలేరు మాజీ ఎమ్మెల్యే చల్లూరు పోచయ్య గుండెపోటుతో మృతి

By

Published : May 15, 2020, 5:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే పోచయ్య మృతికి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పోచయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట కాంగ్రెస్​ నాయకులు పోచయ్య మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. పోచయ్య మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details