యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్లో పోలీసులు కొట్టడంతో మరియమ్మ మరణించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ... చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
మరియమ్మ మరణంతో అడ్డగూడూరు ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు - telangana news
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్లో అనుమానాస్పదంగా మరియమ్మ మరణించడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేశారు.
అడ్డగూడూరు ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు
అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 18న అనుమానాస్పదంగా మృతి చెందిన మరియమ్మ మృతదేహానికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 19న పోస్టు మార్టం పూర్తిచేశారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి... మృతదేహాన్ని వారి స్వగ్రామం అయిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం తరలించారు
ఇదీ చదవండి:మరియమ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన పోలీసులు