తెలంగాణ

telangana

ETV Bharat / state

గోశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి - గోశాల

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ గోశాలలో కొంతకాలంగా ఆవులు మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన వాటిని గోశాల వెనక భాగంలోనే పడేయడం వల్ల దుర్వాసన వస్తోందని, రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోశాల నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలి

By

Published : Aug 25, 2019, 8:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలోని ఓ గోశాలలో గత కొంతకాలంగా గోవులు మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన గోవులను గోశాల వెనక భాగంలోని గుంతలో పడేయడం వల్ల దుర్వాసనతో గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయితే నిర్వహణా లోపం వల్లనే గోశాలలోని ఆవులు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్​ స్పందించి, గోశాల నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

గోశాల నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలి

ABOUT THE AUTHOR

...view details