తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి బైపాస్​పై ప్రమాదం... ఇద్దరి పరిస్థితి విషమం - bypass

యాదాద్రి జిల్లా భువనగిరి బైపాస్​పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించారు.

భువనగిరి బైపాస్​పై ప్రమాదం

By

Published : Jun 26, 2019, 6:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు వనపర్తిలో ఓ శుభకార్యం కోసం వాహనంలో బయలుదేరారు. భువనగిరి బైపాస్​పై ఐటీఐ కళాశాల వద్ద వీరు ప్రయాణిస్తున్న టవేరాను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

భువనగిరి బైపాస్​పై ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details