తెలంగాణ

telangana

ETV Bharat / state

అనిశా వలలో యాదాద్రి విద్యుత్​ శాఖ ఏఈ - విద్యుత్​శాఖ ఏఈ

యాదాద్రి జిల్లాలో విద్యుత్​ శాఖ ఏఈ అనిశా అధికారులకు చిక్కాడు. విద్యుత్​ కనెక్షన్​ మంజూరుచేసేందుకు గంగాపురానికి చెందిన రైతును లంచం డిమాండ్​ చేశాడు ఏఈ లక్ష్మణప్రసాద్​. విసిగిపోయిన రైతు అనినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రూ.6 వేలు తీసుకుంటుండగా ఏఈని అనిశా డీఎస్పీ ఆధ్వర్యంలోని బృందం అదుపులోకి తీసుకుంది.

అనిశా వలలో విద్యుత్​ శాఖ ఏఈ

By

Published : Jun 12, 2019, 7:49 PM IST

యాదాద్రి జిల్లా బీబీనగర్​ సమీపంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా విద్యుత్​ శాఖ ఏఈ లక్ష్మణప్రసాద్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరంలో మోత్కూరులోని ఏఈ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

అనిశా వలలో విద్యుత్​ శాఖ ఏఈ

గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ భూమిలో విద్యుత్​ కనెక్షన్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్న కరెంట్​ కనెక్షన్​ మంజూరు చేసేందుకు ఏఈ లక్ష్మణప్రసాద్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. విసిగిపోయిన రైతు రూ.6 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, అనిశా అధికారులకు సమాచారం ఇచ్చాడు. బీబీనగర్​ సమీపంలోని ఓ హోటల్​లో లంచం ఇస్తుండగా.. డీఎస్పీ ఆనంద్​కుమార్​ ఆధ్వర్యంలోని బృందం ఏఈని అదుపులోకి తీసుకుంది.

ఇవీ చూడండి: యాదాద్రిలో వెలసిన అక్రమ వెంచర్ల తొలగింపు

ABOUT THE AUTHOR

...view details