యాదాద్రి క్షేత్రంలో సీఎం ఆదేశాలతో యాదగిరిగుట్ట, క్షేత్రాభివృద్ధిలో కట్టడాలేవైనా ఆధ్యాత్మికతతో యాత్రికుల్లో భక్తిభావం పెంపొందించేలా రూపొందిస్తున్నారు. ఆ క్రమంలోనే పంచనారసింహుల ఆలయ కనుమదారిని ఆధ్యాత్మిక హంగులతో నిర్మిస్తున్నారు. సుమారు 2 కిలో మీటర్లు కనుమదారిని రెండు వరసలుగా నిర్మిస్తున్నారు.
యాదాద్రి ఆలయ కనుమ దారికి ఆధ్యాత్మిక హంగులు - ఆలయ కనుమ దారికి ఆధ్యాత్మిక హంగులు
యాదాద్రి ఆలయ ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. యాత్రికుల్లో భక్తిభావం పెంపొందించేలా ఆలయ పరిసరాలు, కొండపైకి వెళ్లే దారిని రూపొందిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి.
యాదాద్రి ఆలయ కనుమ దారికి ఆధ్యాత్మిక హంగులు
ఆలయం సందర్శన, దైవాదర్శనాలయ్యాక భక్తులు కొండపైనుంచి కిందికి చేరే దారికోసం సీఎం దిశానిర్దేశంతో స్వామివారి నామాలతో ప్రస్తుతం 19 పిల్లర్లు ఏర్పాటవుతున్నాయి. ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయని యాడా నిర్వాహకులు చెబుతున్నారు. వలయ దారిని సైతం ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దే పనులు వేగవంతం చేశారు.
ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో 500 తితిదే ఆలయాలు