..
ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన లారీ.. - latest news
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామం వద్ద లారీలో మంటలు చెలరేగటం తో అగ్నికి ఆహుతి అయ్యింది. ఈరోజు తెల్లవారుజామున గురుద్వార్ నుంచి చెన్నై వెళ్తున్న లారీలో మంటలు చెలరేగటం తో లారీలో ఉన్న వైర్ల లోడ్ పూర్తిగా కాలిపోయింది. స్థానిక ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. జేసీబీ సహాయంతో లారీలోని వైర్ల లోడ్ని కిందకి దించి మంటల తీవ్రతను కొంత వరకు తగ్గించారు. ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.
లారీలో మంటలు