తెలంగాణ

telangana

ETV Bharat / state

రోగనిరోధక శక్తిని పెంచే కరోనా టీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్త

కరోనా బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచే ప్రకృతి సిద్ధమైన కాడ కషాయాన్ని ప్రతి ఒక్కరూ తాగాలని వలిగొండ ఎంపీపీ నూతిరమేశ్​రాజు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా టీ స్టాల్​ను ఆయన ప్రారంభిచారు.​

a corona tea center established at Valigonda in Yadadri Bhuvanagiri district
రోగనిరోధక శక్తిని పెంచే కరోనా టీ

By

Published : Aug 1, 2020, 8:53 PM IST

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి వలిగొండలో కరోనా వ్యాప్తి నివారణకై రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రజలకు ఉచిత కాడ కాషాయం టీ స్టాల్​ను ఏర్పాటు చేశారు. దీనిని ఎంపీపీ నూతిరమేశ్​ రాజు, సర్పంచ్ బోళ్ల లలితాశ్రీనివాస్ ముదిరాజ్, గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు.

వైరస్ నివారణకై ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ, సామాజిక దూరాన్ని పాటించాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలని నూతి రమేశ్​ అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. విపత్కర సమయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి:'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా

ABOUT THE AUTHOR

...view details