తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి' - LOKSABHA POLLS

తెరాస నేతలు అకారణంగా తమపై దాడి చేశారని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ,ఎస్టీలు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ధర్నా చేస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ఇతర పార్టీ నాయకులు మద్దతు

By

Published : Apr 16, 2019, 8:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ రోజు ఘర్షణ చోటు చేసుకుంది. తమపై దాడి చేసిన తెరాస నేతలందరిపై చర్యలు తీసుకోవాలని వలిగొండ మండల కేంద్రంలో ఎస్సీ,ఎస్టీలు ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిచిపోయాయి.

కొంత మంది నాయకుల పేర్లు కేసు నుంచి తప్పించారని ఎస్సీ,ఎస్టీ నేతలు ఆరోపించారు. అనంతరం తెరాస నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్నఎస్సీ,ఎస్టీలకు ఇతర పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ధర్నా విరమించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీల ధర్నా

ఇవీ చూడండి : షాట్​గన్​ కాంగ్రెస్​లో... భార్య 'సమాజ్​వాది'లో

ABOUT THE AUTHOR

...view details