తాగునీటి కోసం రోడ్డుపై బిందెలను అడ్డుపెట్టి మహిళలు నిరసన వ్యక్తం చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన రహదారిపైకి మహిళలందరూ చేరుకొని రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కాలనీల్లోకి మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని పది రోజులకు ఒకసారి కూడా నల్లాల ద్వారా నీరు అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడో ఒకసారి వచ్చే ట్యాంకర్ నీరు కనీస అవసరాలకు సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవట్లేదని వాపోయారు. సమాచారం అందుకున్న మడికొండ సీఐ, పుర ఏఈ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అధికారులు హమీ ఇవ్వడం వల్ల మహిళలు ఆందోళన విరమించారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - మహిళలు నిరసన
వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్ మండలంలో తాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. తమకు వెంటనే తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం నిరసన చేసిన మహిళలు
ఇవీ చూడండి : బాలాపూర్లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు