ఘనంగా భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు
భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వరంగల్లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు.
భద్రకాళీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు
వరంగల్ వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సింహవాహనంపై కొలువుదీరిన గణపతిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.