కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో వైద్యులు నిరసన తెలిపారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన చట్టంలోని కొన్ని అంశాలు ప్రజారోగ్యానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రేపు ఉదయం నుంచి సేవలు నిలిపివేస్తాం: జూడాలు - nmc
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి ఇరవై నాలుగు గంటలపాటు అన్నిరకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షుడు తెలిపారు. నూతన చట్టం ప్రజారోగ్యానికి నష్టం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు.
రేపు ఉదయం నుంచి సేవలు నిలిపివేస్తాం: జూడాలు
ఇవీ చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత