వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కరోనాను ఎలాగైనా సరే కట్టడి చేయాలని నిశ్చయించుకున్న గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ను విధించుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు సమయపాలన పాటిస్తూ దుకాణాలను మూసివేస్తున్నారు.
భీమారం గ్రామస్థుల స్వచ్ఛంద లాక్డౌన్ - వరంగల్లో కరోనా కట్టడికై స్వచ్ఛంద లాక్డౌన్
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వరంగల్ జిల్లాలోని భీమారం గ్రామస్థులు... కరోనా తమ దరికి చేరకుండా ఉండేందుకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు.
భీమారంలో స్వచ్ఛంద లాక్డౌన్
కేవలం భీమారం గ్రామస్థులే కాకుండా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛంద లాక్డౌన్ను పాటిస్తున్నారు. నిత్యం జనాలతో నిండిపోయే రోడ్లన్నీ లాక్డౌన్ కారణంగా వెలవెలబోయాయి.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు