ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో రైతువేదికలు పూర్తిచేయని పక్షంలో కఠిన చర్యలు తప్పవని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. హన్మకొండలోని మినీ సమావేశమందిరంలో పంచాయతీ రాజ్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డితో కలిసి రైతు వేదికల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు.
నిర్దేశిత సమయంలో రైతువేదికలు పూర్తిచేయకుంటే.. - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
నిర్దేశిత సమయంలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు హెచ్చరించారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డితో కలిసి రైతు వేదికల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు.
నిర్దేశిత సమయంలో రైతువేదికలు పూర్తిచేయకుంటే..
వైకుంఠ ధామాలు, రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. రాత్రి, పగలు పనిచేస్తేనే పూర్తి అవుతాయన్నారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అవసరమైన సామగ్రిని ముందగానే తెప్పించుకోవాలన్నారు.
ఇవీచూడండి:'వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం'