వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్క నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కామారెడ్డి కలెక్టర్ తన వంతుగా మొక్క నాటి.. వరంగల్ అర్బన్ కలెక్టర్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన హరితహారం భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రచారం అవుతుందని, ప్రముఖుల నుంచి సామాన్యులు సైతం ఒకరికి ఒకరు సవాల్ విసురుకొని మొక్కలు నాటుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ముగ్గురు కలెక్టర్లకు.. గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు! - రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో భాగంగా కామారెడ్డి కలెక్టర్ శరత్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు స్వీకరించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో మొక్క నాటి మరో ముగ్గురు కలెక్టర్లకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
రాష్ట్రంలో మరింత పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నందని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి వనాలకు మంచి స్పందన వస్తుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తున్నారని తెలిపారు . తెలంగాణలోని 12000 గ్రామ పంచాయితీలకు పల్లె ప్రకృతి వనాలు, పర్యావరణం, అడవుల పెంపకం పట్ల అవగాహన కల్పించి.. భవిష్యత్ తరాలకు ఆకుపచ్చ తెలంగాణ అందించాలన్న లక్ష్యంతో అందరూ పని చేయాలని ఆయన అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని.. మరింతమంది ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఛాలెంజ్‌లో భాగంగా ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, వరంగల్ జిల్లా కలెక్టర్ ఎండీ అక్బర్‌ను నామినేట్ చేస్తూ.. గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్