తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2020, 5:05 PM IST

ETV Bharat / state

వరంగల్​లో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం!

లాక్​డౌన్​ సమయంలో కరోనా కట్టడి కోసం పోలీసులు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని వరంగల్​ పోలీస్​ కమిషనర్​ రవీందర్​ అన్నారు. హన్మకొండ డివిజన్​ పోలీసుల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీసుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Warangal Police Get Together In Hanmakonda
వరంగల్​లో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం!

వరంగల్​ రూరల్​ జిల్లా హన్మకొండ డివిజనల్​ పోలీసుల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్​ పోలీస్​ కమిషనరేట్​ సీపీ రవీందర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితకాలంలో ఇలాంటి అనుభవం వస్తుందని ఊహించలేదన్నారు. కరోనా కట్టడి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్​ను పోలీసులు​ పటిష్టంగా అమలు పరిచామని ఆయన తెలిపారు. లాక్​డౌన్​ను అమలు చేసి.. కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసులు తమ వంతు బాధ్యతను నెరవేర్చడంలో, ప్రజలు బయట తిరిగి.. కరోనా వాహకాలుగా మారకుండా కట్టడి చేయడంలో పోలీసులు విజయం సాధించారని అభినందించారు. కరోనా సమయంలో కూడా విధులు నిర్వర్తించిన పోలీసుల పట్ల ప్రజలకు మరింత గౌరవం పెరిగిందన్నారు.

లాక్​డౌన్ సమయంలో ప్రజలకు అవసరమయిన నిత్యవసర సరుకులను చేరవేయడంలో పోలీసులు పరోక్షంగా విధులు నిర్వర్తించారని అన్నారు. వలస కూలీలకు భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడం ద్వారా వలసకూలీలు సైతం పోలీసులు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారని.. గుర్తు చేశారు. కరోనా పూర్తిగా అంతం కాలేదని.. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించే పోలీసులు, సిబ్బంది చేతులను తరుచుగా శుభ్రపర్చుకోవాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలన్నారు. లాక్​డౌన్​ సమయంలో సేవలందించిన అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు.

ఇదీ చదవండి:ఈనెల 17న జగన్​, కేసీఆర్​తో ప్రధాని భేటీ

ABOUT THE AUTHOR

...view details