వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ వి.రవీందర్ తెలిపారు. తమ పరిధిలో మొత్తం 2,127 పోలింగ్ కేంద్రాలున్నాయని...245 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా 9,122 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 55 లక్షలకు పైగా నగదు స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని...అవసరమైతే పీడీయాక్టు నమోదుకు వెనకాడబోమని హెచ్చరించారు.
'అవసరమైతే పీడీయాక్ట్ నమోదుకు వెనకాడబోం' - waragal
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ వి.రవీందర్ తెలిపారు. 245 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు.
warangal-police-commissioner