నేరాల నియంత్రణకు ప్రజల సహకారంతో ముందుకు సాగాలని పోలీసులకు వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
రాత్రి కర్ఫ్యూలో ప్రజల్ని కొట్టొద్దు: వరంగల్ సీపీ - Telangana News Updates
వరంగల్ సీపీ తరుణ్ జోషి కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి కర్ఫ్యూలో ప్రజల్ని కొట్టొద్దని పోలీసులకు సూచించారు.
warangal cp
రికార్డులను పరిశీలించి కరోనా బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందిని పలకరించారు. కరోనా దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూనే విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాత్రి కర్ఫ్యూలో పౌరులను కొట్టరాదని తెలిపారు. నేర నియంత్రణకు సీసీ కెమెరాలను ప్రజల సహకారంతో ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు.