వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పాల్గొని మొక్కలను నాటారు. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలను నాటాలని సూచించారు. వరంగల్ నగరంను పచ్చగా మారుస్తానని హామీ ఇచ్చారు.
భావితరాలకు పచ్చని తెలంగాణ అందిద్దాం - Warangal MLA Participeted in Harithaharam programme
హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు.
భావితరాలకు పచ్చని తెలంగాణ అందిద్దాం