తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal Mayor: 'వరద ముంపునకు గురి కాకుండా చర్యలు చేపడుతాం' - వరంగల్​లో వర్షాలు

వర్షాకాలంలో నగరం ముంపునకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఈరోజు కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందంటూ ప్రజలు తమ ఇబ్బందులను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు.

warangal mayor gundu sudharani
వరంగల్ మేయర్ గుండు సుధారాణి

By

Published : Jun 9, 2021, 5:24 PM IST

వరదనీటి ముప్పును అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. నగరంలో భారీ వర్షంతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి పర్యటించారు. ఎనుమాముల మార్కెట్ సమీపంలోని సాయిగణేశ్ కాలనీ వాసులు... వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందంటూ తమ ఇబ్బందులను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. జేసీబీల సాయంతో... కాలువల్లోని చెత్తా చెదారం తొలగించి వర్షపునీరు సరిగా పోయేలా అప్పటికప్పుడు మేయర్ చర్యలు చేపట్టారు.

అన్ని డివిజన్లలోనూ జేసీబీల సాయంతో వర్షపు నీరు వెళ్లిపోయేలా చేస్తున్నామని అన్నారు. ప్రజలెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించి ముందుకెళుతున్నామని మేయర్ చెప్పారు. కరోనా, లాక్ డౌన్​ కారణంగా కొన్ని పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. అవి కూడా పూర్తయితే నగరానికి వరద ముప్పు ఉండదని మేయర్ వెల్లడించారు.

ఇదీ చూడండి:Eatala Rajender: ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడ కేసీఆర్​ వరాలు

ABOUT THE AUTHOR

...view details