వరంగల్ అర్బన్ జిల్లా కాశిబుగ్గలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనం నిర్వహించారు. ఈ వేడుకలకు నగర మేయర్ గుండా ప్రకాశ్ హాజరయ్యారు. ఆలయాన్ని రూ. కోటి నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
'ఆలయాన్ని రూ. కోటి నిధులతో అభివృద్ధి చేస్తాం' - మేయర్ గుండా ప్రకాశ్
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కాశిబుగ్గలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి నగర మేయర్ గుండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయ్యప్ప స్వాములతో కలసి ప్రత్యేక పూజలు జరిపారు.
'ఆలయాన్ని రూ. కోటి నిధులతో అభివృద్ధి చేస్తాం'
అనంతరం అయ్యప్ప స్వాములతో కలసి మేయర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులంతా స్వామియే శరణమయ్యప్ప అంటూ.. మకరజ్యోతి దర్శనంతో పరవశించిపోయారు.
ఇదీ చదవండి:అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం.. ప్రొటోకాల్ వివాదం