తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal KU Bandh Today : పీహెచ్‌డీ ప్రవేశాల రగడ.. నేడు కేయూ సహా వరంగల్‌ జిల్లా బంద్‌ - కాకతీయ యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు

Warangal KU Bandh Today : వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో మరోసారి వివాదాలు రాజుకుంటున్నాయి. పీహెచ్‌డీ ప్రవేశాల్లో జరిగిన అవకతవకలపై రేగిన మంటలు ఇంకా చల్లారట్లేదు. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ.. ఇవాళ వర్సిటీతో పాటు వరంగల్ జిల్లా బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి. కేయూ అధికారులతో జరిపిన చర్చలు విఫలమైనట్లు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు.

Warangal Kakatiya University Bandh Today
Warangal KU Bandh Today

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 7:32 AM IST

Warangal KU Bandh Today పీహెచ్‌డీ ప్రవేశాల రగడ.. నేడు కేయూ సహా వరంగల్‌ జిల్లా బంద్‌

Warangal KU Bandh Today: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పీహెచ్‌డీ కేటగిరీ-2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. కేటగిరీ-2లో అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి.. మెరిట్‌ ప్రకారం రెండో జాబితా ప్రకటించి.. అడ్మిషన్లు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవటంతో పాటు.. రిజిస్ట్రార్‌ను తక్షణమే తొలగించాలని మండిపడుతున్నారు.

Warangal CP on Allegations Police Beating to KU Students : కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం : సీపీ రంగనాథ్

Warangal Kakatiya University Bandh Today : కేటగిరీ-1 కింద సెట్‌, నెట్‌తో పాటు ఎంఫిల్‌ ఉన్న వారు నేరుగా పీహెచ్‌డీ సీట్లు పొందుతున్నారు. కేటగిరీ-2లో ప్రవేశ పరీక్ష రాసిన వారికి రోస్టర్‌ ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే రెండో కేటగిరీలో పైరవీలతో సీట్లు కట్టబెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌డీ సీట్ల భర్తీలో ప్రధానంగా పారదర్శకత లోపిస్తోందంటున్నారు. ఐదేళ్ల తర్వాత గతేడాది 212 సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అనేక విభాగాల్లో పార్ట్ టైం పరిశోధకులకు అందలం వేసి.. వారికి సీట్లు కేటాయించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీట్ల భర్తీకి ముందే రోస్టర్‌, కేటగిరీలను నిర్ణయించి వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉన్నా.. మార్గదర్శకాలను పాటించట్లేదంటున్నారు.

KU students protest: కేయూలో విద్యార్థుల ఆందోళన.. వీసీ ఆదేశాలపై ఆగ్రహం

గతేడాది నోటిఫికేషన్‌ ఇచ్చినా.. ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి పోలీసుల సమక్షంలో వీసీ ఇతర అధికారులతో గంటకుపైగా చర్చించినప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేయూ పరిధిలో కొన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ నిర్ణయం వల్ల కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలో వచ్చిన సీటు కోల్పోతున్న తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ విద్యార్థి విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. వెంటనే స్పందించిన అధికారులు మూడు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. పెంచిన ఫీజులన్నింటినీ తగ్గించాలని, పార్ట్‌ టైం అధ్యాపకుల నియామకం చేపట్టాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Etela Rajendar Fires on CM KCR : 'రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుంది.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు'

ఇక కేయూలో అధ్యాపకుల సంఖ్య తగ్గే కొద్దీ పీహెచ్ డీ సీట్లు తగ్గడం విద్యార్ధులకు శాపంగా మారుతోంది. ఒకప్పుడు రెగ్యులర్ అధ్యాపకులు 150 వరకు ఉండగా 330 పీహెచ్ డీ సీట్లు భర్తీ చేసే వీలుండేది. ఇప్పుడు 90 మంది మాత్రమే ఉండడం.. వారిలో పీహెచ్ డీ పర్యవేక్షకులుగా అర్హత లేని వారు 30 మంది వరకు ఉండడంతో పర్యవేక్షకుల (గైడ్) కొరత ఏర్పడి పీహెచీ డీ సీట్లు గణనీయంగా తగ్గాయి. పీజీ చేసిన వారి సంఖ్య పెరు గుతున్న క్రమంలో పరిశోధన సీట్లు తగ్గడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

పనిచేయని ప్రింటర్​.. వాట్సప్​లో ప్రశ్నాపత్రం పంపి ఎగ్జామ్ రాయించిన ప్రిన్సిపల్

ABOUT THE AUTHOR

...view details