Warangal CP on Allegations Police Beating to KU Students :కాకతీయ విశ్వవిద్యాలయంలో.. పీహెచ్‌డీ కేటగిరి- 2లో ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. తదనంతర పరిణామాలు కలకలం రేపాయి. ప్రవేశాలు రద్దు చేయాలంటూ విద్యార్థులు ప్రిన్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో(students Clash With Police).. విద్యార్థులకు గాయాలయ్యాయి. కార్యాలయ ఫర్నీచర్ ధ్వంసమైంది.
కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణరహితంగా కొట్టారని విద్యార్థులు ఆరోపించగా.. వారిని వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకి తరలించారు. బుధవారం అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో వారిని హాజరుపరచగా 8 మందికి బెయిల్ మంజూరైంది. ఇద్దరికి బెయిల్ నిరాకరించడంతో వారిని జైలుకు తరలించారు. పోలీసుల దాడిని నిరసిస్తూ 12 విద్యార్థి సంఘాలు.. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ఎదుట దీక్షకు దిగాయి. దీనికి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దాడిని నిరసిస్తూ ఈనెల12 జిల్లా బంద్‌కి విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.
Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు
Etela Rajender Respond Police Beating of Students :కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తీసుకెళ్లి కొట్టడం దేశచరిత్రలో తెలంగాణలో జరిగిందని మండిపడ్డారు. వారిని కొట్టిన తీరు చూసి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. విద్యార్థులను ఇంత దారుణంగా కొట్టించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని విమర్శించారు. వారి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
"కేయూ విద్యార్థులను పోలీసులు కొట్టిన తీరు బాధాకరం. విద్యార్థులను టాస్క్‌ఫోర్స్ వాళ్లు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలో జరిగింది. విద్యార్థులను కొట్టిన తీరు చూసి జడ్జి ఆశ్చర్యపోయారు. కేయూ విద్యార్థులను వీసీ కొట్టించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే