వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం సరఫరాలకు ఉపయోగించిన ఒక ఆటోను, నలుగురు అమ్మకందారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ దాదాపు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో మద్యం ఎక్కడ నుంచి తీసుకు వచ్చారనే విషయంపై విచారణ జరుపుతున్నామని మడికొండ సీఐ జానీ నర్సింహులు స్పష్టం చేశారు.
లాక్డౌన్లోనూ మద్యం అమ్మకాలు.. సీజ్ చేసిన పోలీసులు
లాక్డౌన్ నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచి అమ్మకాలు జరుపుతున్న 8 లక్షల రూపాయల మద్యాన్ని వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్లోనూ మద్యం అమ్మకాలు.. సీజ్ చేసిన పోలీసులు