వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వినాయక చవితి సందడి నెలకొంది. చవితి ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో హన్మకొండ చౌరస్తా కిటకిటలాడింది. పూలు, పత్రి, ఎలక్కాయలు, గణేశ్ ప్రతిమల అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వ్యాపారులు పత్రి, పూలు తీసుకుని వచ్చి విక్రయించారు. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు నగరవాసులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఉదయం నుంచే గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి తమ తమ మండపాల్లో ప్రతిష్ఠించడానికి ట్రాలీలో తీసుకెళ్లారు.
హన్మకొండలో వినాయక చవితి సందడి - Hanmakonda
వరంగల్లో వినాయక చవితి సందడి నెలకొంది. ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో హన్మకొండ చౌరస్తా కిటకిటలాడింది.
వినాయక చవితి సందడి