వరంగల్ అర్బన్ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామ శివారులో ఓ ప్రైవేటు పాఠశాలలో హర్షవర్ధన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్ దొంగిలించాడనే కారణంతో ఈశ్వర్ అనే ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా చితకబాది, బెల్టుతో కొట్టాడు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన రాయపురం వెంకన్న శ్రీలత దంపతుల కుమారుడు హర్షవర్ధన్. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆ పాఠశాలలో చేర్పించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
గతంలో ఫీజుల నెపంతో తీవ్రంగా కొట్టారని, మళ్లీ ఇలాంటి సంఘటన జరగదని హామీ ఇచ్చి వాతలు వచ్చేలా చితకబాదారని తల్లిదండ్రులు వాపోయారు. కనీసం ఇంటికి కూడా పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. .
కుమారుడిని చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలను ఆశ్రయించి పాఠశాల ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న అయినవోలు పోలీసులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు ఇదీ చూడండి : నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు