వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై దేవన్నపేట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వారిని గమనించారు. స్థానికులు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ వెంటనే బాధితుడి చెంతకు చేరుకొని 108కు సమాచారం అందించారు.
మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్
రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలవగా.. వెంటనే 108కు సమాచారం అందించారు. వారికి తక్షణ సాయం కింద రూ.5వేలు అందించారు.
మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే
అనంతరం ఎంజీఎం సూపరింటెండెంట్‌తో మాట్లాడి గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. 108 వాహనం వచ్చేంత వరకు అక్కడే ఉండి.. వారికి తక్షణ సాయం కింద 5వేల రూపాయలు అందజేశారు.
ఇదీ చూడండి: కామారెడ్డి బావామరదళ్ల కథ విషాదాంతం