vaccination ఓరుగల్లులో టీకా పంపిణీ.. నిబంధనలు బేఖాతరు - vaccination at Warangal district
వరంగల్ మున్సిపాలిటీ వారు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేస్తున్నారు. ఆన్లైన్ చేసుకునే వద్ద గుంపులు గుంపులుగా ఉండి.. కొవిడ్ నియమాలు పాటించడం లేదు.
vaccination
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో టీకా వేసే కార్యక్రమం కొనసాగుతోంది. వరంగల్ మున్సిపాలిటీ వారు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా సూపర్ స్ప్రెడర్లకు, ఇతరులకు టీకాలు వేస్తున్నారు. ఇందుకోసం నగరంలోని 5 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కొక్క కేంద్రంలో వెయ్యి మందికి పైగా టీకాలు వేస్తున్నారు. ఉదయం నుంచే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. అయితే ఆన్లైన్ చేసుకునే వద్ద గుంపులు గుంపులుగా ఉండి.. కొవిడ్ నియమాలు పాటించడం లేదు.