రామప్ప ఆలయ పర్యటన ముగించుకుని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయాన్ని యునెస్కో బృందం సందర్శించింది. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. యునెస్కో ప్రతినిధి వాసు పొష్యనందన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గుడి పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. యునెస్కో ప్రతినిధులు ఆలయ కళాఖండాలను చరవాణిలో బంధించారు. ఆలయ శిల్ప సంపదను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం ముందు జరుగుతున్న కళ్యాణమండపం పనులను పరిశీలించారు.
వేయి స్తంభాల ఆలయంలో యునెస్కో బృందం - 1000
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని యునెస్కో బృందం సందర్శించింది. ఆలయంలో పూజలు నిర్వహించి.. గుడి విశిష్టత గురించి తెలుసుకున్నారు సభ్యులు.
యునెస్కో బృందం