వరంగల్ పట్టణంలో ఉగాది పండుగ సందడి నెలకొంది. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని హన్మకొండ చౌరస్తాలో పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో ఆ ప్రాంతం రద్దీగా మారింది. వేపపూత, చింతపండు, మామిడి కాయలు, మామిడి ఆకులు, పచ్చడి కుండలు, పూలు, పండ్లు తదితర సామాగ్రిని కొనుగోలు చేశారు. పండుగ సాకుతో.. ధరలు భారీగా పెంచారని కొనుగోలుదారులు వాపోయారు.
ఉగాది పండుగ శోభను సంతరించుకున్న ఓరుగల్లు - flowers
వరంగల్ జిల్లా అప్పుడే పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పండుగకు సంబంధించిన సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు హన్మకొండ చౌరస్తాకు భారీగా తరలిరావటంతో రహదారులు కిటకిటలాడాయి.
పూజా సామగ్రి కొనుగోళ్లలో ప్రజలు