ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. 9 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ 1, 2 డిపోలతో పాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, భూపాలపల్లి, ములుగు డిపోలో బస్సులు.. ప్రాంగణాలకే పరిమితమయ్యాయి. 9 డిపోల పరిధిలో మొత్తం 712 బస్సులు నిలిచిపోగా... 230 అద్దె బస్సులను అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ సర్వీసులను నడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించటంతో పాటు రవాణా ఛార్జీలను రెండింతలు చేశారు.
ఉమ్మడి వరంగల్‌లో ఆగిన రథచక్రాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. 9 డిపోల పరిధిలో మొత్తం 712 ప్రభుత్వ బస్సులు నిలిచిపోయాయి.
ఉమ్మడి వరంగల్‌లో ఆగిన రథచక్రాలు