తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు విడుదలకానున్న టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు - tsicet-2020 final key

తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2020 ఫలితాలను, తుది కీను ఈరోజు విడుదల చేయనున్నట్లు కాకతీయ విశ్వ విద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ చూడాలని సూచించింది.

icet
icet

By

Published : Nov 2, 2020, 1:05 PM IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్-2020 ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 మధ్య నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను నవంబర్ 2 మధ్యాహ్నం గం.3.30ని. విడుదల చేయనున్నట్లు కాకతీయ విశ్వ విద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://icet.tsche.ac.in ను చూడాలని సూచించింది.

ఫలితాలతో పాటుగా తుది కీని కూడా ఇవాళ విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీఎస్ ఐసెట్-2020 ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సరైన జవాబులు ఈ కీ లో ఉంటాయని వెల్లడించింది.

ఇవీ చదవండి : శంషాబాద్​ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details