తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బులు వసూలు చేసి... టికెట్లు ఇవ్వట్లేదు - tourists

పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని డబ్బులు తీసుకున్నారు. రేపుమాపు అంటూ తిప్పుకున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ధర్నాకు దిగారు.

ట్రావెల్ ఏజెన్సీ ముందు బాధితులు ఆందోళన

By

Published : May 25, 2019, 7:25 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని షణ్ముఖ ట్రావెల్ ఏజెన్సీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. గోవా, సిమ్లా, బెంగళూరు, కేరళలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు... ప్రయాణాల రాకపోకల కోసం నగదును చెల్లించినప్పటికీ.. టిక్కెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయానికి వస్తే ఎవరు అందుబాటులో లేరని...ఫోన్లు కూడా పనిచేయడం లేదని వారు ఆగ్రహించారు. ట్రావెల్​ ఏజెన్సీ నిర్వాహకురాలు లలితపై ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

ట్రావెల్ ఏజెన్సీ ముందు బాధితులు ఆందోళన

ABOUT THE AUTHOR

...view details